KMR: పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారం చేసి గాయపరిచిన నిందితుడు రాహుల్ కుమార్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచనల మేరకు ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని మహారాష్ట్ర గోండియా జిల్లాలో పట్టుకున్నారు.