KDP: నవంబర్ 8న కడపకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. దర్గా ప్రతినిధులు ఉరుసు ఉత్సవాలకు రావాలని ఆహ్వానించడంతో తప్పకుండా వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, 8వతేదీన జరిగే ఉరుసు, ముషాయిరా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని సమాచారం.