AP: ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మె విరమించింది. 10 రోజుల్లో రూ.670 కోట్లు.. 15 రోజుల్లో మిగతా బకాయిలు చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇవ్వడంతో నేటి నుంచే NTR వైద్య సేవలను పునరుద్ధరించేందుకు అసోసియేషన్ సమ్మతించింది. అటు యూనివర్సల్ హెల్త్ స్కీమ్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.