TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం దారు ప్రతిబింబ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ, సర్వ గాయత్రి హోమం, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారికి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.