KDP: కడప రైల్వే స్టేషన్ గూడ్సెషెడ్ ఏఐటీయూసీ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. యూనియన్ అధ్యక్షుడు కేసీ బాదుల్లా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1920లో లాలా లజపతిరాయ్ సమక్షంలో ఏఐటీయూసీ స్థాపించబడిందని, కార్మిక హక్కుల కోసం పలు చట్టాలను సాధించిందని గుర్తుచేశారు.