ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లకు 109 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (52*) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్ (0), అభిషేక్ (52*) పరుగులతో ఉన్నారు.