E.G: మొంథా తుఫాన్ ప్రభావిత రైతులు, మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో 251 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు చెప్పారు. అదనంగా రాజమండ్రి రూరల్ పరిధిలో మరో 173 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, రూ.1.55 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.