WGL: ఉమ్మడి జిల్లాలో మొంథా తుఫాను రైతులకు భారీ నష్టం కలిగించింది. అయితే 2,15,972 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా, 1,29,228 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్‌లో 1,30,200, హనుమకొండలో 34,718, మహబూబాబాద్‌లో 26,029, జనగామలో 25,025 ఎకరాల పంటలు నష్టపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు ఇవాళ కోరారు.