ప్రకాశం: ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్‌ను నవంబర్ 1వ నుంచి 30వ తేదీ వరకు అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల వారు పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు చేయకూడదని హెచ్చరించారు.