TG: వరంగల్ జిల్లాలో నాలాలు, చెరువుల కబ్జాలను తొలగించాల్సిందేనని CM రేవంత్ అధికారులకు సూచించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. పంట నష్ట పరిహారానికి ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ఎకరాకు లక్ష అయినా చెల్లిస్తామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.