ADB: జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో U-17 జోనల్ లెవల్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. నవంబర్ 3న బాలబాలికల రగ్బీ, 4న బాలుర కబడ్డీ, 5న బాలికల క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు సంబంధిత పోటీల్లో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం 10 గంటలలోపు హాజరుకావాలని పోటీల కన్వీనర్లు తెలిపారు.