TPT: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి జరగనున్నాయి. ఇందులో భాగంగా 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 17న ధ్వజారోహణం, చిన్నశేష, 18న పెద్దశేష, హంస, 19న ముత్యపుపందిరి, సింహ, 20న కల్పవృక్షం, హనుమంత, 21న పల్లకీ, గజ, 22న సర్వభూపాల, స్వర్ణరథం, గరుడ వాహన సేవ జరుగుతుంది. 23న సూర్యప్రభ, చంద్రప్రభ, 24న రథోత్సవం, అశ్వవాహనం, 25న పంచమీతీర్థం.