ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులోని పాత కూచిపూడి పల్లెలో పార్క్ ఎదురుగా ఉన్న పోలేరమ్మ తల్లి దేవత నూతన దేవాలయమును కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.