ప్రకాశం: ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పెద్ద చెర్లోపల్లి మండలం అలవలపాడులో ఎస్సై కోటయ్య మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు బస్సులు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్లును తనిఖీ చేసి, ఇన్సూరెన్స్ లేని, నిబంధనలు పాటించని వాహనాలకు ఎస్సై జరిమానా విధించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.