SRCL: వేములవాడ పరిధి చిన్న బోనాల గురుకుల పాఠశాలలో జరుగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియను సిరిసిల్ల ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీలకు కౌన్సిలింగ్ నిర్వహించగా ఆమె పరిశీలించారు. విద్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ డెస్క్లు, సర్టిఫికెట్ల పరిశీలనను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.