KRNL: ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజీ సమీపంలో ఉన్న న్యాక్-స్కిల్ హబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్ఛార్జ్ రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ఈ శిక్షణకు అర్హులని ఆయన చెప్పారు. శిక్షణ అనంతరం ఉపాధి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 5 అని పేర్కొన్నారు.