MDK: శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం తూకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం తూకం వేయాలని సిబ్బందికి సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.