AP: మాజీ సీఎం జగన్కు తుఫాన్ల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయనకు బాధగా ఉందేమోనని ఎద్దేవా చేశారు. తుఫాన్ ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం సూచనల మేరకు విద్యుత్ శాఖ అప్రమత్తమై సిబ్బందిని మోహరించిందన్నారు. ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే కూటమి ప్రభుత్వం పని చేసిందని చెప్పుకొచ్చారు.