KNR: మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు.