JN: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని తరిగొప్పులలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి గౌడ్, బృంగి శివకుమార్, మూడవత్ సంపత్, ఇంద్రా రెడ్డి తదితరులున్నారు.