TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, NSS ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జాతీయ సమైక్యతకు వల్లభాయ్ పటేల్ ఎంతగానో కృషి చేసినట్లు చెప్పారు.