NRPT: మక్తల్ మండలం రుద్రసముద్రం గోదాం వద్ద తక్షణమే వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనుకి వినతిపత్రం అందించారు. గోదాంలో ఇప్పటికే వసతులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రుద్రసముద్రం, ఖానాపూర్, పరిసర గ్రామాల రైతులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు.