BHPL: గోరీకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఈర్ల రాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు భారత తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పల్లెబోయిన తిరుపతి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఈర్ల శ్యాము, యూత్ ఉపాధ్యక్షులు పసల రాకేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.