ATP: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ వాయిదా పడింది. అన్ని నియోజకవర్గాలలో నవంబర్ 4న తలపెట్టిన ర్యాలీ కార్యక్రమం వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. నవంబర్ 11న ఈ ర్యాలీ జరుగుతుందన్నారు.