NLG: ఖమ్మం జిల్లా సీపీఎం, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు హత్యను సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తున్న నాయకులను హతమార్చడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్య, బండ శ్రీశైలం, బొబ్బలి సుధాకర్ రెడ్డిలు డిమాండ్ చేశారు.