NDL: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 16 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపరిటెండెంట్ ఉమాదేవి, ఉపసర్పంచ్ బురానుద్దీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.