AP: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 నవంబర్ 17న అనురాధ దంపతులను హత్య చేయడంతో దోషులు చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజూనాథ్, ఎం వెంకటేష్‌కు ఉరిశిక్ష, జరిమానా విధించింది. పదేళ్లపాటు విచారణ కొనసాగింది. 23 మందిని నిందితులుగా చేర్చి, 122 మంది సాక్షులను విచారించారు. ఈనెల 24న ఐదుగురిపై నేర నిర్ధారణ కావడంతో ఉరిశిక్ష విధించింది.