MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సీఎంవో కిరణ్ రాజ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల కొరత, వైద్య నైపుణ్యల సేవలపై సీఎంవోకు సిబ్బంది విన్నవించారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానన్నారు. వైద్య సేవలను తెలుసుకునేందుకు ఆస్పత్రిని విజిట్ చేసినట్లు పేర్కొన్నారు.