ELR: గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వెంటనే షీట్లు తెరవాలని, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.