BDK: CM రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు గురువారం హాజరయ్యారు. తుఫాన్ ప్రభావం ఉన్న 16 జిల్లాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని సీఎం తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.