KNR: కరీంనగర్ జిల్లాలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ రామచందర్ రావు తెలిపారు. మహమ్మద్ గౌస్ బాబా, మహమ్మద్ అబీద్, దొబ్బల పవన్, సుధాకర్ అనే ఈ నలుగురు కలెక్టరేట్ గేటు వద్ద ఓ వ్యక్తిని బెదిరించి రూ” 3000 దోచుకున్నారు. ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించమన్నారు.