HYD: నగర సీపీ వీసీ సజ్జనార్ గురువారం ఐసీసీసీలోని కమిషనర్ కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును స్వయంగా పరిశీలించారు. టవర్ ఏ లోని అడ్మిన్, అకౌంట్స్, ఐటీ, కంట్రోల్ రూమ్ తదితర విభాగాలకు వెళ్లిన ఆయన సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. డయల్ 100కు వస్తున్న కాల్స్, స్పందిస్తున్న తీరు, తదితర వివరాలపై ఆరా తీశారు.