ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పెద్ద స్థాయిలో కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని 10 నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ. 23 వేల వరకు జీతం లభించే అవకాశం ఉందని, 18 నుంచి 30 ఏళ్ల వయసు కలవారు పాల్గొనాలన్నారు.