నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అల్లూరు మండలంలోని గోగులపల్లి, సింగపేట, కొండాయగుంట తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.