BDK: మణుగూరు మండలం గుట్ట మల్లారం గ్రామానికి చెందిన చక్రపాణి ఆటో, టాటా మ్యాజిక్, మరో కారుపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఉదయం పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమవగా, టాటా మ్యాజిక్ క్యాబిన్ కాలిపోయింది. కారు స్వల్పంగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.