TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతోందని చెప్పారు. రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ఉంటుందని తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేసి, భవిష్యత్తులో వరద ముంపు లేకుండా చేస్తామని తుమ్మల హామీ ఇచ్చారు.