KNR: కరీంనగర్‌లోని పద్మానగర్‌లో నిర్మించనున్న వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి TTD 30 కోట్లు మంజూరు చేసింది. ఆలయ పరిసరాల్లో 3 కోట్లతో ఆధ్యాత్మిక ఉద్యానవనాన్ని కూడా నిర్మించనుంది. 4 ఏళ్ల క్రితం మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆలయ నిర్మాణం కోసం అప్పటి TTD ఛైర్మను ప్రతిపాదనలు పంపారు. దీనిని TTD ఆమోదించడంతో ఆలయానికి 10ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.