WGL: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయి బాబు కథనం ప్రకారం కత్తుల కొమురయ్య (75) వృద్ధుడు గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడు తుండేవాడు. దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.