సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనున్న నేపథ్యంలో నవంబర్ 24న సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.