కృష్ణా: పెదన మండలంలోని చెన్నూరు, చేవంద్ర, కొమ్మరిల్లి గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలాలను వైసీపీ ఇంఛార్జ్ ఉప్పాల రాము గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, భారీ నష్టాన్ని గురైనారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.