అనకాపల్లి మండలం శంకరం గ్రామ పరిధిలో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురువారం పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అధికారులను పంపించి సర్వే చేయించి బాధిత రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. గత నెలలో పంట కాలువలను ఆధునీకరించడంతో నష్టాన్ని తగ్గించ గలిగామని తెలిపారు.