TG: తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయిన వారిని కూడా ఆదుకుంటామని చెప్పారు.