NZB: భీమ్‌గల్ మండలంలోని పిప్రి, బాబానగర్, జాగిర్యాల్ గ్రామాలను రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ బృందం గురువారం సందర్శించింది. ఇందులో భాగంగా పిప్రి గ్రామంలో నీటి నిలువ కందకాల పనులు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు పరిశీలించారు. బాబానగర్‌లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, సీసీ రోడ్డు పనులు పరిశీలించి, ఉపాధిహామీ రికార్డులు తనిఖీ చేశారు.