BDK: సైనిక్ స్కూళ్లలో 6 వ, 9వ తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాల్టితో ముగియనున్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పెంచారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 10 వరకు, తప్పుల సవరణకు 12-14 తేదీల్లో అవకాశం కల్పించారు. అర్హత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది.