SRPT: భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో, బ్రిడ్జీల వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం మూసీ నదిపై భీమవరంలో లెవెల్ బ్రిడ్జీని పరిశీలించిన ఆయన, ప్రజలు నదులు, కాలువల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.