KNR: చొప్పదండి నియోజకవర్గంలోని మంగపేట గ్రామంలో బుధవారం కురిసిన వర్షం వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. గురువారం ఎమ్మెల్యే సత్యం ఆయా పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు.