MNCL: జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామానికి చెందిన కత్తెరపాక రాజేష్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జాయింట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లో ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నగరిగిరి ప్రీతం నుంచి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.