AP: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అద్దంకి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అలాగే తుఫాన్ దాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పునరుద్ధరణ చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.