WGL: వరంగల్ నగరం లోని శివనగర్ ప్రాంతంలోని నేతాజీ స్కూల్ వద్ద వరద ప్రవాహానికి బుధవారం యువకుడు వరద నీటి నుంచి దాటుతుండగా నీటిలో గల్లంతయ్యాడు. అతడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం అతని మృతదేహం లభ్యమైనది. మృతుడు గీసుకొండ మండలం కుచెందిన పులి అనిల్ అని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.