GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.